calender_icon.png 9 January, 2026 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీళ్ల గోస

08-01-2026 01:30:11 AM

  1. నాటి నుంచి నేటి వరకు నీటి వాటాపై పోరాటమే
  2. చంద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణవాదుల ఆగ్రహం

హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి) : దశాబ్దాల పాటు ఉమ్మడి పాలనలో నీళ్ల కోసం తెలంగాణ ప్రాంతం అనేక కష్టాలను ఎదుర్కొన్న ది. రాష్ట్రం ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య నీళ్ల కొరతే. నదులు ఉన్నా, ప్రాజెక్టుల్లో నీటి వాటా ( water share) దక్కక, సాగునీరు అందక తెలంగాణ రైతాంగం ( Telangana farmers ) తరతరాలుగా గోస పడింది. (borewells, livelihood) బోరు బావులే జీవనాధారంగా మారాయి. ఇదే బాధ ‘నీళ్లు-నిధులు-నియామకాలు’ ( water-funds-jobs ) పేరిట చివరికి separate state movement ) ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిగా నిలిచింది.

అలాంటి (anguish, agitation, suffering) ఆవేదన, ఆందోళన, బాధతో కూడిన చారిత్రక నేపథ్యం ఉన్న తెలంగాణలో నీటి హక్కులపై జరుగుతున్న పోరాటా న్ని రాజకీయాలు అంటూ చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వాదుల్లో, ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. నీటి హక్కులపై జరుగుతున్న పోరాటాన్ని రాజకీయా లు అంటూ తేలికగా కొట్టిపారేయడంపై తెలంగాణ వాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. కృష్ణాగోదావరి జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే అది రాజకీయమా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తెలంగాణకు.. నీళ్లే జీవనాధారం అని, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలే నీటి సమస్యలకు మూలకారణమని తెలంగాణవాదులు గుర్తుచేస్తున్నారు. అలాంటి చారిత్రక నేపథ్యంలో నీటి హక్కులపై మాట్లాడటాన్ని రాజకీయంగా ముద్ర వేయడం అనుచితమని అభిప్రాయపడుతున్నారు. పోలవరం, బనకచర్ల వంటి ప్రాజెక్టుల ద్వారా తెలం గాణ వాటాకు భంగం కలిగే ప్రమాదం ఉందని, దీనిపై ప్రశ్నలు వేయడం రాష్ట్ర హక్కుల కోసం పోరాటమే తప్ప రాజకీయ లాభాల కోసం కాద ని స్పష్టం చేస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధంగా తెలంగాణకు రావాల్సిన నీటిని కాపాడాల్సిన బాధ్యత ఉందని డిమాండ్ చేస్తున్నారు. నీళ్లు రాజకీయ అంశం కాదని, ప్రజల జీవన హక్కు అని తెలంగాణ వాదులు స్పష్టంచేస్తూ, చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండి స్తున్నారు. నీటి వివాదాలను రాజకీయం అని పక్కన పెట్టడం కాకుండా, న్యాయ పరిష్కారం కోసం చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. 

నాటి నుంచి నేటి వరకు ఆందోళనే..

తెలంగాణ చరిత్రను వెనక్కి తిరిగి చూస్తే, ప్రతి దశలోనూ నీళ్లే కేంద్రబిందువు. నాటి ఉమ్మడి రాష్ట్రం దశాబ్దాల నుంచి ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా నీటి భద్రత తెలంగాణకు నిరంతర ఆందోళనగానే కొనసాగుతోంది. నదులు ఉన్నా, వర్షపాతం సరిపడినా, సాగునీరు మా త్రం అందని పరిస్థితి. ఎత్తున భూభాగం, ప్రాజెక్టు ల కొరత, విధానపరమైన నిర్లక్ష్యం కలసి తెలంగాణను నీటి సంక్షోభంలోకి నెట్టివేసింది. ఉమ్మడి రాష్ట్రంలో నీటి పంపిణీలో జరిగిన అసమతుల్యత వల్ల లక్షల ఎకరాలు వర్షాధారంగా మిగి లిపోయాయి.

ప్రత్యేక రాష్ట్రం తర్వాత భారీ సాగునీ టి ప్రాజెక్టులు ప్రారంభమైనా, కృష్ణాగోదావరి జలాలపై వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఎగువ దిగువ రాష్ట్రాల మధ్య నీటి హక్కుల పోరు, కేంద్ర నిర్ణయాలు, ట్రిబ్యునళ్ల జాప్యం కలిసి తెలంగాణను ఇప్పటికీ అప్రమత్తంగానే ఉంచుతున్నాయి. ఈరోజు నీళ్లపై జరిగే ప్రతి చర్చ రాజకీయంగా కనిపించినా, తెలంగాణకు అది జీవన సమస్య. నాటి నుంచి నేటి వరకు నీళ్ల గురించి ఆందోళన. అందుకే నీటి హక్కులపై ప్ర శ్నించడం, పోరాటం చేయడం రాజకీయాలు కా దు, తెలంగాణకు జీవన అవసరంగా మారింది.

చంద్రబాబు ధోరణిపై విమర్శలు..

నీటి హక్కులపై తెలంగాణ వ్యక్తం చేస్తున్న ఆందోళనను రాజకీయాలు అంటూ తేలికగా కొట్టిపారేయడంపై చంద్రబాబు నాయుడు ధోరణిని తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఎండగడుతు న్నారు. దశాబ్దాల అన్యాయం, నిర్లక్ష్యాన్ని అనుభవించిన రాష్ట్రానికి నీళ్ల అంశం రాజకీయ ఎజెండా కాదని స్పష్టం చేస్తున్నారు. కృష్ణా, గోదావరి జలాల పంపిణీలో తెలంగాణకు జరగబోయే నష్టాలపై ప్రశ్నలు లేవనెత్తడాన్ని రాజకీయ కోణంలో చూడడం అన్యాయమని విమర్శిస్తున్నారు.

పోలవరం, బనకచర్ల వంటి ప్రాజెక్టుల వల్ల తెలంగాణ హక్కులకు భంగం కలిగే అవకా శం ఉన్నప్పుడు మౌనం వహించాలా? అని ప్రజ లు నిలదీస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన నీటి అన్యాయాలను విస్మరించి మాట్లాడటం, ప్రత్యేక రాష్ట్రంగా మారిన తర్వాత కూడా అదే ధోరణి కొనసాగడం ఆమోదయోగ్యం కాదని అంటున్నారు. నీళ్లపై మాట్లాడితే రాజకీయమా? మా బతుకుల గురించి మాట్లాడితే ఆరోపణలా? అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

నీటి వివాదాల్లో వాస్తవాలు, చట్టబద్ధ హక్కులే ప్రాతిపదికగా చర్చ జరగాలని, వ్యాఖ్యలతో కాకుండా న్యాయసమ్మత పరిష్కారంతో ముందుకు రావాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నారు. ఆయన ధోరణిని తెలంగాణ ప్రజలు బహిరంగంగా ఎండగడుతున్నారు. నీళ్ల కోసం ఉద్యమం చేసిన రాష్ట్రానికి, నీటి అంశాన్ని తేలికగా మాట్లాడటం అవమానమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. అయితే  చం ద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణ నాయకుల నుంచి స్పష్టమైన, గట్టి స్పందన ఎందుకు లేదన్న ప్రశ్నలు ప్రజల్లో మొదలయ్యాయి.

నీటి హక్కుల వంటి సున్నితమైన విషయంలో మౌనం వహించడం సరైనదేనా? అనే సందేహాలు వ్యక్తమవు తున్నాయి. ప్రజలు ఇప్పుడు ప్రతి మాటను, ప్రతి చర్యను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నీళ్ల అంశం రాజకీయాలకు అతీతమని, ఇది తెలంగాణ భవిష్యత్తుతో ముడిపడిన అంశమని భావిస్తున్న వారు నాయకత్వం నుంచి స్పష్టత కోరుతున్నారు. నీళ్ల కోసం సాగిన ఉద్యమ చరిత్రను మర్చిపోకుండా, నేటి పరిస్థితుల్లో కూడా అదే ఉద్యమ స్ఫూర్తిని చూపాలని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు.