మహనీయుల స్ఫూర్తిని మనమంతా ఆదర్శంగా తీసుకోవాలి
మాజీ మంత్రి వెంకట స్వామి జయంతి వేడుకలలో జిల్లా కలెక్టర్ శ్రీహర్ష
పెద్దపల్లి (విజయక్రాంతి) : మహనీయుల స్ఫూర్తిని మనమంతా ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన మాజీ కేంద్ర మంత్రి (కాక) జి.వెంకట స్వామి జయంతి వేడుకలలో అదనపు కలెక్టర్ లు జే.అరుణ శ్రీ, జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మారు మూల ప్రాంతంలో జన్మించినప్పటికీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగిన మహనీయులు కాకా వెంకట స్వామి జీవితంలో అనేక పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేశారని, అటువంటి మహనీయులు మన ప్రాంతంలో జన్మించడం మనందరికీ గర్వ కారణమని, కాకా వెంకట్ స్వామి అందించిన స్ఫూర్తితో మనందరం పని చేయాలని, విధులు నిర్వహించే సమయంలో అట్టడుగు వర్గాల వారికి మన వంతు సహకారం అందేలా చూడాలని కలెక్టర్ సూచించారు.




