calender_icon.png 8 August, 2025 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగాను ప్రపంచానికి చాటిన గొప్ప దేశం మనది

08-08-2025 01:02:21 AM

ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి) :  యోగా ద్వారా భారతదేశ కీర్తిప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పడం జరిగిందని ఎమ్మె ల్యే పాయల్ శంకర్ అన్నారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలోని ఓ గార్డెల్ల్ గురువారం తెలంగాణ యోగసన స్పోరట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీనియర్ల రాష్ట్ర స్థాయి 6వ యోగా పోటీలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన  పలువురు చేసిన యోగ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలను తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ   చొరవతో ప్రపంచ వ్యాప్తంగా యోగాను అధికారికంగా జరుపుకుంటున్నారని గుర్తు చేశారు.

యోగాను ప్రతి ఒక్కరు సాధన చేయాలని, తద్వారా ఆరోగ్యం తో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి,  పలు జిల్లాల నుంచి వచ్చిన యోగా టీచర్లు, నాయకులు తదితరులు ఉన్నారు.