5 May, 2026 | 3:36 AM

సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరిక

05-05-2026 02:13 AM

కాంగ్రెస్ పార్టీలో చేరిన కర్కల్ పహాడ్ సర్పంచ్

కడ్తాల్, మే 4, (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో పలువురు చేరుతున్నారని  ఎమ్మెల్యే కస్టడీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అర్హులైన అందరికీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కడ్తాల్ మండలం కర్కాల్ పహాడ్ సర్పంచి తేజు నాయక్ సోమవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరగా, ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు.

గతంలో బిజెపి మద్దతుతో సర్పంచిగా గెలిచిన తేజు నాయక్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై పార్టీలో చేరినట్లు ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో  మండలపార్టీ అధ్యక్షుడు బిచ్చ నాయక్, కడ్తాల్  సర్పంచి  బిక్షపతి, ఉప సర్పంచ్ యాదగిరిరెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,సింగిల్ విండో మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ బ్లాక్ కాంగ్రెస్ నాయకులు నర్సింహా,నాయకులు రామకృష్ణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.