25 August, 2026 | 4:44 AM

సీఎంతో తీన్మార్ మల్లన్న భేటీ

12-06-2024 12:24 AM

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సం దర్భంగా తీన్మార్ మల్లన్నను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. ఈ తర్వాత సీఎం నివాసంలోనే మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు.. చామల, తీన్మార్ మల్లన్నను శాలువా కప్పి సన్మానించారు. ఈ భేటీలో మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ తదితరులున్నారు