20-12-2025 12:38:30 AM
మంత్రి గడ్డం వివేకానంద
చెన్నూర్, డిసెంబర్ 19: నియోజక వర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కాం గ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటొకటిగా నెరవేర్చుకుంటూ వస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖామంత్రి గడ్డం వివేకానంద అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ కమ్యూనిటీ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులతో కలిసి హాజరై కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండల కేంద్రంలో రూ. 20 లక్షల డిఎంఎఫ్‌టి నిధుల తో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, భవనం మరింత విస్తరించేందుకు అదనంగా మరో రూ. 20 లక్షలు మంజూరు చేసి అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
అనంతరం చెన్నూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తో సమీ క్షించి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు, చెన్నూర్ తహసిల్దార్ మల్లికార్జున్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.