calender_icon.png 22 May, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

21-05-2025 12:39:41 AM

ఇండియన్ డెంటల్ అసోసియేషన్ 

ఖైరతాబాద్; మే  20 (విజయ క్రాంతి) : డెర్మటాలజిస్టు డాక్టర్ రాజేత దామిశెట్టి డెంటల్ వైద్యులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (ఐడిఎ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్. డి. ఎన్.స్వా మి కార్యదర్శి డాక్టర్ డి.చలపతి రావు తెలిపారు.మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఐడిఎ తెలంగాణ శాఖ, తెలంగాణ రాష్ట్ర డెంటల్ కౌన్సిల్ (టిఎస్ డి సి) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. డెంటల్ సర్జన్లను వైద్యులుగా పరిగణించకూడదని, ‘డెంటల్ మాఫియా’ అంటూ వ్యాఖ్యలు చేసి డాక్టర్ రాజేత దామిశెట్టి డెంటిస్టుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని మండిపడ్డారు.

డెంటల్ వైద్యులు నీతి, నిజాయితి, నిబద్ధతతో పనిచేస్తున్నారని తెలి పారు. అనంతరం టిఎస్ డి సి రిజిస్ట్రార్ డాక్టర్ రవికిరణ్ రెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారంటున్న డాక్టర్ రాజేత దామిశెట్టి వెంటనే డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఫిర్యాదు చేసి, పరిష్కరించుకోవచ్చని, కానీ, ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మొత్తం డెంటల్ వృత్తికే కళంకం తెచ్చేలా మాట్లాడటం దుర్మార్గమైన చర్య అని అన్నారు.

డెంటల్ క్లినిక్ లో స్కిన్ చికిత్సకు పాల్చడే వారితో తమకేం సంబంధం లేదన్నారు. ఐడిఎ సైబరాబాద్ ప్రతినిధి డాక్టర్ బి.శ్వేత మాట్లాడు తూ డెర్మటాలాజి వైద్యాసుపత్రులు పట్టగొడుగుల్లా పుట్టు కొస్తున్నా యని, వీటికి వ్యతిరేకంగా చేసే పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు.

సమావేశంలో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇం డియా సభ్యులు డాక్టర్ జి.ప్రమోద్ కుమా ర్. టిఎస్ సభ్యులు డాక్టర్ సుధీల్ రామిశెట్టి, ఐడిఎ సైబరాబాద్ బ్రాంచి డాక్టర్ ఎం.కిరన్ కుమార్, సిడిహెచ్ కన్వీనర్ డాక్టర్ కె.రాజేశేరెడ్డి, డాక్టర్ మనిత, డాక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.