21-05-2025 12:42:56 AM
రాజేంద్రనగర్, మే 20: కుటుంబ కల హాల నేపథ్యంలో ఓ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శంషాబాద్ ఎయిర్పో ర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చో టుచేసుకుంది. ఇన్స్పెక్టర్ బాలరాజు కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం 9 గంట ల సమయంలో పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌడమ్మ గుట్ట సమీపంలో ఓ వ్యక్తి మృత దేహంగా పడి పడి ఉన్నాడు.
డయల్ 100 కు సమాచారం అందడంతో పోలీసులు ఘ టనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించా రు. మృతదేహానికి సమీపంలో ఓ కాలేజీ బ్యాగు పడి ఉంది. అందులో ఐడి కార్డు, పు రుగుమందు డబ్బా కనిపించింది. ఐడీ కార్డు ద్వారా మృతుడిని హైదరాబాదులోని నాగో ల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నేరెళ్ల వెంకట రామ రాజు కుమార్ (40) గా గుర్తించారు.
అక్కడే పడివున్న మొబైల్ ఫోన్ ద్వారా తిరుపతిలో ఉన్న అతడి సోదరుడికి సమాచారం ఇచ్చా రు. మృతుడు తిరుపతిలో ఇరిగేషన్ శాఖలో పని చేస్తుండేవారు. కుటుంబ కలహాలతో పు రుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ట్లు పోలీసుల విచారణలో తేలింది. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.