అంబేద్కర్ ఆశయ సాధనలో అందరం భాగస్వాములు కావాలి
ఎమ్మెల్యే బీఎల్‌ఆర్
మిర్యాలగూడ, ఏప్రిల్ 14: అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి( బిఎల్‌ఆర్) అన్నారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, డిసిసి అధ్యక్షులు పున్నా కైలాస్ నేత, అన్ని రాజకీయ పార్టీల కుల, ప్రజా, దళిత,అంబేద్కర్ యువజన సంఘం నాయకులతో కలిసి రాజీవ్ చౌక్ నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. న్యాయబోజ్- సహపంక్తి భోజనాలు చేసి ఉచిత బ్లడ్ బ్యాంకు ను ప్రారంభించారు. తదుపరి ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ సిద్ధాంతాలే మనకు మార్గదర్శకాలని నియోజకవర్గ అభివృద్ధిలో అందరము భాగస్వామ్యులమవుద మన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరు సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్,డిఎస్పి రాజశేఖర్ రాజు, ఎం వి ఐ చంద్రశేఖర్ గౌడ్, రైస్ మిల్లర్స్ అధ్యక్షులు శ్రీనివాస్, ధీరావత్ స్కైలాబ్ నాయక్, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






