11-08-2025 01:51:37 AM
- బీజేపీ మహాంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్..
- ముషీరాబాద్ తిరంగా యాత్ర
ముషీరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): నవ భారత నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని బీజేపీ మహాంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ అన్నారు. ఆదివారం బీజేవైఎం ముషీరాబాద్ నియోజకవర్గం కన్వీనర్ గడ్డం నవీన్ ఆధ్వర్యంలో భోలక్ పూర్ లోని దేవునితోటలో గల భవాని శంకర ఆలయ ప్రాంగణం నుంచి నిర్వహించిన తిరంగ యాత్రను భరత్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశ సమగ్రత, సమైఖ్యతకు ప్రధాని నరేంద్రమోదీ అంకిత భావంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అవినీతి రహిత పాలన కొనసాగిస్తూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి పనులను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఆదర్శ ప్రధాన మంత్రిగా మోదీని ఇచ్చారన్నారు. దేశ భద్రత కోసం మోదీ అహర్నిశలు కృషిచేస్తున్నారని ప్రతి పౌరుడు దేశం కోసం బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ ర్యాలీలో బీజేపీ ముషీరా బాద్ నియోజకవర్గం జాయింట్ కన్వీనర్ ఎం. నవీన్ గౌడ్, బీజేవైఎం నాయకులు సురేష్ కుమార్, అనిల్ కుమార్, ఆయూష్, సాయి యాదవ్, వెంకటేష్, సంతోష్, శ్యామ్, బీజేపీ రాష్ర్ట నాయకులు నందగిరి నర్సింహా, బిజ్జి కనకేష్ కుమార్, ముషీరాబాద్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కంచి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.