మానుకోటలోనే రైల్వే మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేయించాలి
మహబూబాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): మహబూబాబాద్ ప్రాంతంలోనే రైల్వే మెగా మెయింటినెన్స్ డిపోను ఏర్పాటు చేయించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని రైల్వే డిపో సాదన కమిటి ప్రతినిధులు కలిసి విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ లోనే రైల్వే మెగా మెయింటనెన్స్ డిపో ప్రాజెక్ట్ తరలిపోకుండా ముఖ్యమంత్రి ద్వారా భూసేకరణ కు లేఖ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ గత కొన్ని మాసాలుగా మహబూబాబాద్ లో డిపో ఏర్పాటు కోసం స్థల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, జాతీయ స్థాయిలో కూడా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహబూబాబాద్ లోనే ప్రాజెక్ట్ ఏర్ఫాటు చేయడాని స్థలసేకరణ, ఇతర అంశాలపై స్ఫష్టంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాదన కమిటీ కన్వీనర్ డాక్టర్ డోలి సత్యనారాయణ, కో ఆర్డినేటర్ మైస శ్రీనివాసులు, కో కన్వీనర్ లు మండల వెంకన్న, మార్నేని వెంకన్న, గుగ్గిళ్ల పీరయ్య మాదిగ, పిల్లి సుధాకర్, గోన శ్యామ్ రావు, ఘనపురపు అంజయ్య, భూక్య శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.






