పట్టుదల క్రమశిక్షణతో ముందుకు సాగాలి
13-10-2025 02:58 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): పట్టుదల క్రమశిక్షణతో ముందుకు సాగాలని అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని ఆదిలాబాద్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న బ్యాడ్మింటన్ శిక్షణ తరగతులను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి తో కలిసి క్రీడాకారులను పరిచయం చేసుకొన్నారు. ఈ మేరకు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన మంచిర్యాలలో జరిగే ఉమ్మడి జిల్లా జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీల్లో క్రీడాకారులు తమ ప్రతిభను కనబరిచాలని సూచించారు. క్రీడల్లో రాణించాలంటే శిక్షణ తరగతులను తీసుకోవాలని అన్నారు. ఈకార్యక్రమంలో సాయి, కబీర్ దాస్ తదితరులు ఉన్నారు




