13-10-2025 03:02:51 PM
తడిచిన ప్రతి గింజను ప్రభుత్వం కోనుగోలు చేస్తుంది
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల,(విజయక్రాంతి): తడిచిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులెవరు ఆ ధైర్య పడవద్దని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. సోమవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షం కారణంగా రామన్నపేట మండలంలోని దుబ్బాక, మునిపంపుల, పల్లివాడ గ్రామలలో తడిచిన వరి ధాన్యాన్ని పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకొని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం రైతులకు ధైర్యం చెప్పాడు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ... మండలంలో కురిసిన 10 సెంటీమీటర్ల వర్షం కారణంగా ఐకెపి కేంద్రాలలో ఉన్న ధాన్యం తడవగా పరిస్థితి తెలిసిన వెంటనే అధికారులతో కలిసి పంట నష్టం పరిశీలించామని, తడిచిన ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఎవరూ అధైర్య పడవద్దని, మీ ధాన్యం కోనుగోలు అయే వరకు జాగ్రత్త పడాలని, ప్రభుత్వ పరంగా ధాన్యం కోనుగోల్లను వేగవంతం చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో వర్షాలు ఇంకా ఉన్నాయి కాబట్టి, రైతులు జాగ్రత్తగా ఉండాలని ధాన్యం తడవకుండా ఉండేలా కావలసిన జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే తో పాటు ఆర్డిఓ, ఎమ్మార్వో వివిధ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు రైతులను పరామర్శించారు.