13-10-2025 02:53:21 PM
రూ.77 లక్షల వ్యయంతో మౌలిక వసతుల అభివృద్ధి
పటాన్చెరు: పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ‘మన ఊరు–మన బడి’ పథకం కింద రూ.67 లక్షల వ్యయంతో నిర్మించిన నాలుగు అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అదే పాఠశాలలో ఆర్డీసీ కాంక్రీట్ ఇండస్ట్రీస్ సంస్థ సిఎస్‌ఆర్ నిధులతో మరో రెండు అదనపు తరగతి గదులను రూ.10 లక్షల వ్యయంతో నిర్మించారు. వీటిని కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు.