24 July, 2026 | 3:08 AM

లక్ష్యసాధనతో ముందుకు సాగాలి

24-07-2026 01:22 AM

సాన్వి నవోత్సవంలో కరీంనగర్ మేయర్ శ్రీనివాస్

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు, సా మాజిక బాధ్యతను అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్‌లోని సాన్వి జూనియర్ కాలేజీ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘నవోత్సవం సాంస్కృతిక వేడుకలకు ఆయన హాజరై ప్రా రంభించారు. ఈ సందర్భంగా మేయర్ మా ట్లాడుతూ.. చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, సేవా దృక్ప థం పెంపొందించుకోవాలని సూచించారు.

సాన్వి జూనియర్ కాలేజ్  డిఫెన్స్ అకాడమీ విద్యార్థులను పోటీ ప్రపంచానికి అనుగుణంగా తీర్చిదిద్దుతూ విద్యా, క్రీడా, సాంస్కృతి క రంగాల్లో ప్రోత్సహించడం అభినందనీయమని కొనియాడారు. కళాశాల చైర్మన్ అరంశెట్టి మునీందర్ మాట్లాడుతూ, విద్యార్థులను కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దడమే కాకుండా దేశానికి సేవ చేసే బాధ్యతగల పౌరులుగా తయారు చేయడమే సాన్వి జూనియర్ కాలేజ్ డిఫెన్స్ అకాడమీ లక్ష్యమని అన్నారు.

కార్యక్రమంలో సామాజిక సేవకుడు నాగేశ్వర్, పచ్చునూరి సురేందర్, ట్రెడిషనల్ యోగా గురువు మెహర్ కుశల్, పోలీస్ సంఘం అధ్యక్షులు మామిడాల సురేందర్, లయన్స్ క్లబ్ నాయకుడు లయన్ మధుసూదన్‌రెడ్డి, శేఖర్, గుంటుపల్లి స్వామి, వంశీధర్‌రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.