24 July, 2026 | 2:36 AM

జేఎన్‌టీయూలో సైబర్ సెక్యూరిటీ సీటు సాధించిన విద్యార్థిని అభినందించిన కలెక్టర్

24-07-2026 01:24 AM

ఆదిలాబాద్, జూలై 23 (విజయక్రాంతి): జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సైబర్ సెక్యూరిటీ) విభాగంలో సీటు సాధించిన విద్యార్థి కొత్తపల్లి హరివర్ధన్ను జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు.

కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హోమ్ గార్డుగా విధులు నిర్వహిస్తున్న కొత్తపల్లి ఆశన్న కుమారుడు హరి వర్ధన్ ఈ ఘనత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.