8 March, 2026 | 3:39 AM

పురుషాధిక్యాన్ని దాటుకోవాలి

08-03-2026 12:37 AM
  1. మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించాలి
  2. ఆ లక్ష్యంగా ఆడబిడ్డలు కష్టపడాలి
  3. సవాళ్లు దాటుకొని ముందుకు సాగాలి 
  4. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలి
  5. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  6. మహిళా దినోత్సవం సందర్భంగా బొబ్బా నవతారెడ్డి ఆధ్వర్యంలో పురస్కారాల ప్రదానం

హైదరాబాద్, మార్చి 7 (విజయక్రాంతి)/శేరిలింగంపల్లి: మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడి, ఆర్థిక స్వాతంత్య్రం సాధించే దిశగా ముందుకు సాగాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆడబిడ్డలకు ఆర్థిక స్వాతంత్య్రమే అసలైన గౌరవం ఇస్తుందని కేటీఆర్ అన్నారు. ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా, సొం తంగా ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ కు టుంబానికి ఆసరాగా నిలిచే స్థాయికి ఎదిగినప్పుడే సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తాయన్నారు.

రాబోయే రోజుల్లో మహి ళా రిజర్వేషన్లు అమలులోకి రానున్న నేపథ్యంలో, చదువుకున్న విద్యావంతులు, సా మాజిక స్థితిగతులపై అవగాహన ఉన్న మహిళలు రాజకీయాల్లోకి రావాలని కేటీఆర్ కోరారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హ యాంలో స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని, భవిష్యత్తులోనూ మహి ళా సంక్షేమం కోసం మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.

కేసీ ఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, షీ టీమ్స్, భరోసా వంటి పథకాలు మహిళలకు అండగా నిలిచాయని గుర్తు చేశారు. అంతర్జాతీయ మహి ళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గం చందా నగర్‌లో బొబ్బా నవతారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా పురస్కారాల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజ రయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సమాజంలో పురుషాధిక్యత అడుగ డుగునా ఉన్నదని, రాజకీయాలు కూడా దానికి అతీతం కాదని అభిప్రాయపడ్డారు. ‘ఒక రంగంలో పురుషుడు విజయం సాధించడానికి 100 శాతం కష్టపడితే, అదే రంగ ంలో మహిళ రాణించాలంటే 200 శాతం శ్రమించాల్సిన పరిస్థితి ఉంది. పోటీ ప్రపంచంలో మహిళలు నిలదొక్కుకోవాలంటే రె ట్టింపు ప్రయత్నం చేయక తప్పదు‘ అని ఆయన పేర్కొన్నారు.

వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన సోషల్ వర్కర్స్, ఆర్టిస్టు లు, జర్నలిస్టులు, శానిటేషన్ వర్కర్లు, ప్రజా ప్రతినిధులకు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మాధవరం కృష్ణారావు, నాయకులు నరేందర్, పాండురంగారెడ్డి, బొబ్బా నవతారెడ్డి పాల్గొన్నారు.