22-01-2026 12:01:02 AM
డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ అనిత
మంచిర్యాల, జనవరి 21 (విజయక్రాంతి) : జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎం అండ్ హెచ్‌ఓ) డాక్టర్ అనిత కోరారు. బుధ వారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రీ ఓరియంటేషన్ అవగాహన కార్యక్రమం నిర్వహించి జిల్లా వైద్యాధికారులకు అసంక్రమణ వ్యాధులపైన నిర్వహించి న సమీక్షా సమావేశంలో స్టేట్ అసంక్రమణ వ్యాధుల కోఆర్డినేటర్ డాక్టర్ అబ్దుల్ వాసిద్ తో కలిసి డీఎం అండ్ హెచ్‌ఓ మాట్లాడారు. జిల్లాలో 30 ఏండ్ల పైబడిన వారందరికీ అసంక్రమణ వ్యాధులను గుర్తించి చికిత్సలు అందిస్తున్నామన్నారు.
ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరిగి వ్యాధిగ్రస్తులను ముఖ్యం గా బీపీ, షుగర్, క్యాన్సర్ రోగులను గుర్తించి వారి వివరాలను పోర్టల్ లో నమోదు చేయడము చేయాలని ఆదేశించారు. మిడిల్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ దగ్గర ఉన్న వివరములను మందశాతం ఫాలోఅప్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్, సిహెచ్ ఓ లింగారెడ్డి, వెంకటేశ్వర్లు, నరసింహస్వామి, ప్రశాంత్, డీపీఓ ప్రశాంతి, డీడీఎం ప్రవళిక, డెమో బుక్క వెంకటేశ్వర్, డీపీహెచ్‌ఎన్ పద్మ, క్షయ వ్యాధి నియంత్రణ కోఆర్డినేటర్ సురేందర్, వైద్యాధికారులు, సుపర్ వైజర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.