calender_icon.png 22 January, 2026 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజీవీల్స్‌తో రోడ్డుపై వెళుతున్న ట్రాక్టర్ పట్టివేత

22-01-2026 12:00:43 AM

సుల్తానాబాద్ జనవరి 21 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుళ్ళ గ్రామంలో కేజీవీల్స్ తో రోడ్డుపై నడుస్తున్న ట్రాక్టర్ను ఎస్త్స్ర చంద్రకుమార్ బుధవారం పట్టుకున్నారు, నీరుకుళ్ళ గ్రామానికి చెందిన సాగర్ రావు దిగా ట్రాక్టర్ ను గుర్తించారు. ఈ విధంగా రోడ్లపై కేజీవీల్స్ తో ట్రాక్టర్ లు నడపడం వల్ల రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయని,దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎవరూ కేజీవీల్స్ తో రోడ్ల పైకి రాకూడదని, ఒకవేళ వచ్చినట్లయితే జరిమానాతో పాటు కఠిన చర్యలు త ప్పవని ఎస్త్స్ర చంద్రకుమార్ హెచ్చరించారు.. ఈ ట్రాక్టర్ ను తదుపరి చర్యల కోసం సుల్తానాబాద్ తాసిల్దార్ కి అప్పగించడంతో తహ శీల్దార్ భషీరుద్దీన్ 5 వేల రూపాయలు జరిమాన విధించారని ఎస్త్స్ర చంద్రకుమార్ తెలిపారు.