విదేశీ ఆస్తులను దాచిపెట్టడం ప్రమాదకరం
- ఆస్తులు వెల్లడించకుంటే క్రిమినల్ చర్యలే
- అదనపు ఆదాయపు పన్ను కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి
ముషీరాబాద్, మే 24 (విజయక్రాంతి): భారతీయ నివాసితులు విదేశీ ఆదాయం, ఆస్తులు వెల్లడించకుంటే తీవ్రమైన క్రిమినల్ విచారణ తప్పదని తెలంగాణ అండ్ ఏపి అదనపు ఆదాయపు పన్ను కమిషనర్ వై. శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ తాజ్ త్రీస్టార్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్‌బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్లాక్‌మనీ యాక్ట్ లా అండ్ ప్రాక్టీస్‌పై ఆదివారం అవగాహన సదస్సు అసోసియేషన్ అధ్యక్షులు సీఏ చంద్రశేఖర్ వేముల అధ్యక్షతన జరిగింది.
ఈ సదస్సుకు వై. శ్రీకాంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నల్లధనం (వెల్లడిం చని విదేశీ ఆదాయం, ఆస్తులు), పన్ను విధిం పు చట్టం, 2015 అనేది భారతీయ పౌరుల వద్ద ఉన్న వెల్లడించని విదేశీ ఆదాయం, ఆస్తులపై జరిమానా విధించడానికి, పన్ను విధించడానికి రూపొందించబడిన ఒక భారతీయ చట్టమన్నారు. ఇది వెల్లడించని ఆస్తుల విలువపై ఫ్లాట్ 30శాతం పన్ను, 300శాతం జరిమానాతో పాటు, తీవ్రమైన క్రిమినల్ విచారణను కూడా విధిస్తుందని చెప్పారు.
సీఏ చంద్రశేఖర్ వేముల మాట్లాడుతూ ఏఐ వేగం గా విస్తరిస్తున్న ఈ అత్యంత సవాళ్ల కాలంలో పన్ను నిపుణులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాన్నారు. ఈ సదస్సులో అసోసియేషన్ కార్యదర్శి సీఏ ఆశిష్ జోషి, కోశాధి కారి సోమేశ్వర్ నెమ్మాని, సలహాదారు సీఏ రామ్‌దేవ్ బుటాడా, కాంపిటేషన్ కమిటీ చైర్మ న్ సీఏ అమృత్ కుమార్ కోటా, ఉపాధ్యక్షులు సీఏ పీవీ నారాయణరావు, మాజీ అధ్యక్షులు సీఏ హితేష్ జైన్, సీఏ పూర్ణచంద్రరావు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు సీఏ రమణారెడ్డి, సీఏ ప్రవల్లిక వేముల, ఎన్‌వీ చారీ, అజయ్ వాల్వే, ఏపీ దహిమా పాల్గొన్నారు.






