calender_icon.png 17 September, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

పారమిత పాఠశాలలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

17-09-2025 07:55:45 PM

కరీంనగర్ క్రైమ్ (విజయక్రాంతి): స్థానిక పద్మనగర్ పారమిత హెరిటేజ్ సిబిఎస్ఇ పాఠశాల(Paramita Heritage School)లో తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రజాపాలన దినోత్సవాన్ని, దేశభక్తి, ఉత్సాహం, విద్యాపరమైన ఆత్మపరిశీలనతో జరుపుకున్నారు. రాష్ట్ర విశిష్ట చరిత్రను మరియు ప్రజాస్వామ్య స్పూర్తిని స్మరించుకునే విధంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాక ఆవిష్కరణతో ప్రారంభమై,జాతీయ గీతం ఆలాపనతో సాగింది. అనంతరం, డైరెక్టర్ హన్మంతరావు, ప్రిన్సిపాల్ గోపికృష్ణ ప్రేరణాత్మక ప్రసంగాలు చేసి, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, తెలంగాణ ప్రయాణంలో సెప్టెంబర్ 17వ తేదీకి ఉన్న ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు.

పారమిత హెరిటేజ్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ విమోచన పోరాట వారసత్వాన్ని మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య మార్గదర్శక వ్యవస్థ యొక్క ఉజ్వలతను కూడా వెలుగులోకి తెచ్చింది. ఈ సందర్భంగా పారమిత విద్యాసంస్థల చైర్మన్ డా. ఈ. ప్రసాద్ రావు  విద్యార్థులు,ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు తెలంగాణ విమోచన, ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు రష్మిత, కె.హన్మంతరావు, ప్రిన్సిపాల్ గోపికృష్ణ, కోఆర్డినేటర్లు రబీంద్ర పాత్రో, నాగరాజు, రాము, భవాని నిఖిత ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.