calender_icon.png 12 September, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి

04-09-2025 12:11:41 AM

డీ ఆర్ డీ ఏ పీడీ, జిల్లా పరిషత్ సీఈఓ అప్పారావు

పెన్ పహాడ్,  సెప్టెంబర్ 3 : పల్లెలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని డీ ఆర్ డీ ఓ పీడీ, జిల్లా పరిషత్ సీఈఓ అప్పారావు అన్నారు.  మండలంలోని సింగారెడ్డి పాలెం, అనంతారం గ్రామాలలో బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సింగారెడ్డి పాలెం గ్రామంలోని పశువుల కొట్టములు నిర్మాణంలో ఉన్న మరియు పూర్తి అయిన పనులను పరిశీలించారు. పైలెట్ గ్రామము అయిన అనంతారంలోనీ బోర్ వెల్ రీఛార్జి స్ట్రక్చర్ ,  ఇంకుడు గుంటలు పనులను  నర్సరీనీ సందర్శించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాల కారణంగా గ్రామాలలో పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కార్యదర్శులకు సూచించారు. క్యాటిల్ షెడ్స్, ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకున్న వెంటనే లబ్దిదారులకు బిల్లులు చెల్లించే విధంగా ఆన్లైన్ చేయాలె తప్ప జాప్యం చేయరాదన్నారు.  కార్యక్రమంలో ఏపిఓ రవి, ఈసీ మహేష్, టిఏలు రామకృష్ణ, ఏక స్వామి పంచాయతీ కార్యదర్శులు  అఖిల్ ,  సోమయ్య  , క్షేత్ర సహాయకులు జ్యోతి ,  బేగం ఉన్నారు.