calender_icon.png 12 September, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంకల్ప్ అవగాహన కార్యక్రమం కట్టుదిట్టంగా నిర్వహించాలి

04-09-2025 12:11:32 AM

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): మహిళల అభ్యున్నతి కోసం సంకల్ప్ పేరిట నిర్వహించే పది. రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్లో ఎస్పీ మహేష్ బి. గీతేతో కలిసి సమీక్ష నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు జరిగే కార్యక్రమాల్లో పి.సి.పి.ఎన్.డి.టి యాక్ట్, మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.

మహిళల సంక్షేమం కోసం రూపొందించిన పథకాలు, ఉపాధి అవకాశాలపై కనీసం 500 మంది మహిళలతో అవగాహన సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. అలాగే బేటీ బచావో-బేటీ పడావో, జెండర్ సెన్సిటైజేషన్, వ్యక్తిగత పరిశుభ్రత, శానిటరీ ప్యాడ్ వినియోగంపై విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు.మహిళల సేఫ్టీ చట్టాలు, షీ టీమ్స్ పనితీరు, ఉద్యోగ స్థలాల్లో వేధింపుల నివారణ కమిటీలు, లీగల్ క్లినిక్ ఏర్పాటు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు.

బాలికల్లో అనేమియా నిర్మూలన, మహిళల్లో క్యాన్సర్ నిరోధం, పోస్కో యాక్ట్ పై అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మిరాజం, డి.ఆర్.డి.ఓ శేషాద్రి, డిఈఓ వినోద్ కుమార్, డిపిఓ షరీఫుద్దీన్, డిఎం & హెచ్‌ఓ డాక్టర్ రజిత, సఖి సెంటర్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.