22-05-2025 12:41:30 AM
ఎమ్మెల్సీ శంకర్ నాయక్
నల్లగొండ టౌన్, మే 21 : పార్టీ శ్రేణులం తా రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం కృ షి చేయాలని ఎమ్మెల్సీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. భార త మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాం ధీ వర్ధంతిని బుధవారం నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు వీటి కాలనీలో ఘ నంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆ యన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనం గా నివాళులర్పించారు. దేశానికి రాజీవ్ గాం ధీ చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గు మ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చై ర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నా యకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.