calender_icon.png 14 July, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల జోలికి వస్తే ఊరుకోం

13-07-2025 07:31:50 PM

మత్స్యకారుల సంఘం సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు మర్రి భరత్ ముదిరాజ్.. 

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): బీసీల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బీసీ వాదం ఎత్తుకుంటే చంపేస్తారా అని మత్స్యకారుల సంఘం సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు మర్రి భరత్ ముదిరాజ్ అన్నారు. ఆదివారం క్యూ న్యూస్ ఆఫీస్ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) బీసీ బిడ్డపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఏదైనా ఆరోపణలు ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప చిల్లర రాజకీయాలు చేయొద్దన్నారు. ఎమ్మెల్సీ కవితకు బీసీలకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. బీసీ బహుజన బిడ్డ తీన్మార్ మల్లన్నపై దెబ్బ పడిన ప్రగతి భవన్ స్తంభాలను కదిలిస్తామని హెచ్చరించారు.