అగ్ని ప్రమాద బాధితులను అదుకుంటాం
ప్రభుత విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల, మే 30 (విజయ క్రాంతి): ఈత చోట్లు దగ్ధమై ఉపాధి కోల్పోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రభుత విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ భరోసానిచ్చారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం సిరికొండలో ఇటీవల అగ్ని ప్రమాదం సంభవించి సుమారు 1200 ఈతచెట్లు దగ్ధమైన సంగతి తెలిసిందే. బాధితు కుటుంబాలను గురువారం కలెక్టర్ షేక్ యాష్మీన్ బాషా, ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్ సత్తయ్యతో కలిసి పరామర్శించారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రభుత్వం నుంచి సాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు. పర్యటనలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేముల సుభాష్, జడ్పీటీసీ రాజేందర్, మాజీ సర్పంచ్‌లు తిరుపతి, అశోక్ రావు, ఎన్నం కిషన్‌రెడ్డి, నాయకులు సిగిరి అంజిత్, మహేష్, సత్తయ్య ఉన్నారు.






