15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తాం

12-10-2025 04:00 AM
  1. బీసీ రిజర్వేషన్లపై రాజీపడే ప్రసక్తే లేదు
  2. బనకచర్ల విషయంలో హరీశ్‌రావుది బురద కడుక్కునే ప్రయత్నం 
  3. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ 

నిజామాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): బీసీల రిజర్వేషన్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకై తమ పార్టీ కట్టుబడి ఉన్నదని, అవసరమైతే సుప్రీంకోర్టు కు వెళ్తామని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. శనివారం ఆయ న నిజామాబాద్‌లో మాట్లాడుతూ.. హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టు ద్వారా న్యాయ పోరాటం చేపడతామని అన్నారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడం ప్రధాన కారణం బీజేపీ అని ఆరోపించారు. కుల సర్వే పారదర్శకంగా నిర్వహించామని, ఆ ఆధారంతోనే సుప్రీంకోర్టు తలుపు తట్టనున్నట్టు స్పష్టం చేశారు.

బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నిక లకు వెళ్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఒక ఆర్డినెన్స్, మూడు చట్టాలు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ బీసీ రిజర్వేషన్ ధర్నాకు బీజేపీ నేతలు ఎందుకు ముఖం చాటేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌రెడ్డి సర్కార్‌కు బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని, సీఎం రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హత బీజేపీ, బీఆ ర్‌ఎస్ నేతలకు లేదని అన్నారు. 

బీఆర్‌ఎస్ నిర్లక్ష్యంతోనే బనకచర్ల జీవో 

బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బనకచర్ల జీవో వెలువడ్డాయని ఆరోపించారు. బనకచర్ల విషయంలో హరీశ్‌రావు బురదను కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాయలసీమను రత్నాల సీమ చేస్తా అన్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. అప్పటి సీఎం జగన్‌తో కేసీఆర్ చేట్టాపట్టాలు వేసుకొని అభివృద్ధిని మరిచి, విందులు వినోదాలు చేసుకున్నారని ఆరోపించారు. ప్రజల హక్కుల విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించి ప్రజల సమస్యలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. బనకచర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్ప ష్టం చేశారు.

కాగా నిజామాబాద్ జిల్లాకు రావలసిన నిధులు, అభివృద్ధి విషయంలో బీజేపీ నేతలు చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని తెలిపారు. జిల్లాలోని ఆర్వోబి పనుల విషయంలో కేంద్రం ఇచ్చిన నిధులు పెండింగ్‌లో ఉన్నాయని, కానీ తప్పంతా రాష్ట్ర ప్రభుత్వమే అన్నట్టుగా బీజేపీ నేతలు అరోపిస్తున్నారని ఎండగట్టారు. హైదరాబాద్ నుంచి ముంబై వ యా నిజామాబాద్ రైల్వే లైన్ విషయమై ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించామని తెలిపారు.  నిజామాబా ద్‌ఘైబాస రఘై వరకు రోడ్డు వేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, గడువు గంగాధర్, అరికల నర్సారెడ్డి, రత్నాకర్ హాజరయ్యారు.