20-07-2024 01:06:03 AM
మానవ హక్కుల కమిషన్ నియామకంపై..
హైకోర్టుకు ప్రభుత్వం వివరణ
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల నియామక ప్రక్రియను రెండు మాసాల్లో పూర్తి చేస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. చైర్మన్, సభ్యులను నియామకం చేపట్టకపోవడాన్ని సవాల్ చేస్తూ అద్నాన్ మహమ్మద్ గత ఏడాది వేసిన పిల్‌ను శుక్రవారం చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జ్యుడీషియల్, సాంకేతిక సభ్యుల నియామకానికి మార్చి 10న నోటిఫికేషన్ వెలువడిందన్నారు. నియామక ప్రక్రియ పూర్తికి రెండు మాసాల గడువు కావాలని చెప్పారు. దీంతో విచారణ 8 వారాలకు వాయిదా పడింది.