calender_icon.png 8 August, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

3న అమెరికాకు సీఎం రేవంత్

20-07-2024 01:05:12 AM

రాష్ట్రానికి పెట్టుబడుల కోసం టూర్

వివిధ కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో భేటీ 

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవ ంత్ రెడ్డి అమెరికా పర్యటనకు సంబంధించి తేదీ ఖరారైంది. ఆగస్టు 3 రాత్రి హైదరాబాద్ నుంచి సీఎం బృందం అమెరికా బయలుదేరి వెళ్లనుంది. రా ష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందు కు రేవంత్‌రెడ్డితో పాటు అధికారులు అమెరికాకు వెళ్లనున్నారు. వారంరోజుల పాటు అమెరికాలోనే ఉండే సీఎం బృందం డల్లాస్‌తో పాటు ఇతర రాష్ట్రాలలోనూ పర్యటించనుంది. తి రిగి ఆగస్టు 11న సీఎం హైదరాబాద్‌కు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుందని, ప్రభు త్వం నుంచి అన్ని విధాలుగా సహకా రం ఉంటుందని భరోసా ఇవ్వనున్నా రు. సీఎం ఇటీవలే సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లి పాస్ పోర్టు రెన్యూవల్ చేయించుకున్నారు.