calender_icon.png 8 August, 2025 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దర్యాప్తు డైరీని సమర్పించండి

20-07-2024 01:09:27 AM

బీఆర్‌ఎస్ కార్యకర్త హత్యకేసులో పోలీసులకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): కొల్లాపూర్‌లో బీఆర్‌ఎస్ కార్యకర్త శ్రీధర్‌రెడ్డి హత్య కేసు దర్యాప్తు డైరీని 4 వారాల్లోగా సమర్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తన కుమారుడి హత్యకేసు విచా రణ చేసి నిందితులను పట్టుకోవడంలో పోలీసులు వైఫల్యం చెందారని శేఖర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి విచారించారు. ఈ ఏడాది  మే 23న తన కుమారుడిని పదునైన ఆయుధాలతో అతి కిరాతకంగా నరికి చంపారని, ఇందులో అధికార పార్టీ నేతల హస్తముందని ఆరోపించారు. స్థానిక మంత్రి పోలీసులపై ఒత్తిడి తెచ్చి దర్యాప్తు జరగనీయకుండా చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పోలీసులు ఏడుగురు సాక్షులు, నలభై మందికి పైగా సభ్యులను విచారించారని చెప్పారు. వాదనల తర్వాత కేసు డైరీని నాలుగు వారాల్లోగా సమర్పించాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది.