calender_icon.png 14 May, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంట్లో చొరబడి చంపేస్తాం

14-05-2025 01:43:08 AM

  1. ధర్మ సంస్థాపనార్థం పోరు మన సంప్రదాయం
  2. పాక్ సైన్యం ఊపిరి పీల్చుకునే వీలులేకుండా దెబ్బకొట్టిన భారత సైన్యం
  3. సరిహద్దులో ఇనుప గోడలా మన వాయుసేన
  4. యుద్ధ క్షేత్రంలోనూ భారత్‌మాతాకీ జై అన్న మన సైనికులు
  5. ఆదంపుర్ ఎయిర్ బేస్‌ను ఆకస్మికంగా సందర్శించిన ప్రధాని మోదీ 
  6. వైమానిక దళ వీరజవాన్లతో కలిసి సందడి

భారత్ మాతాకీ జై

సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్ గట్టిగా దెబ్బతీస్తుంది. హమ్ ఘర్ మే గుస్‌కర్ మారేంగే, ఔర్ బచ్ నేకా ఏక్ మోకా తక్ నహీదేంగే (వారి ఇంట్లోకి వెళ్లి చం పేస్తాం, పరారయ్యేందుకు కూడా అవకాశం ఇవ్వం).

 ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, మే 13: ‘ఆపరేషన్ సిందూర్’తో భారత సైన్యం పాకిస్థాన్ మిలటరీకి తగిన బుద్ధి చెప్పిందని, పాక్ సైన్యం ఉగ్రవాదులతో కలిసి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే వీలులేకుండా చేశామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మన సైనికులు యుద్ధ క్షేత్రంలోనూ భారత్ మాతాకీ జై అన్నారని ప్రధాని తెలిపారు. ‘ఆపరేషన్ సిందూర్’ మన సైన్యం పరాక్రమాన్ని ద్విగుణీకృతం చేసిందని ప్రధాని కొనియాడారు.

భారత్ చూపిన ఈ పరాక్రమం త్రివిధ దళాల త్రివే ణి సంగమంగా ఉందన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి చెంప చెల్లుమనిపించే విధానమే కొనసాగుతుందని ఆయన చెప్పారు. మన దేశంలోని అతిపెద్ద ఎయిర్ బేస్‌లో రెండవదైన పంజాబ్‌లోని ఆదంపుర్ ఎయిర్ బేస్‌ను మంగళవారం ఉదయం సందర్శించిన ప్రధాని మోదీ అక్కడ భారత వైమానిక దళ వీర జవాన్లను ఉద్దేశించి ప్రసంగించారు.

పాకిస్థాన్ ఆర్మీని నమ్ముకున్న అక్కడి ఉగ్రవాదులను భారత సైనికులు, భారతీయులు మట్టికరిపించారని చెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్ గట్టిగా దెబ్బతీస్తుందని ‘హమ్ ఘర్ మే గుస్‌కర్ మారేంగే, ఔర్ బచ్‌నేకా ఏక్ మోకా తక్ నహీదేంగే’ (వారి ఇంట్లోకి వెళ్లి చంపేస్తాం, పరార య్యేందుకు కూడా అవకాశం ఇవ్వం). అని ప్రధాని ఉద్ఘాటించారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ గీసిన లక్ష్మణ రేఖ ఏమిటో ఇప్పుడు ప్రపంచానికి స్పష్టమైందన్నారు. మరోసారి భారత్‌పై దాడి జరిగితే గట్టి జవా బే ఉంటుందని అన్నారు. ‘ఆపరేషన్ సిందూ ర్’ ప్రతి ఘట్టంలోనూ మన త్రివిధ దళాలు సామర్థ్యాన్ని చాటుకున్నాయని చెప్పారు. భారత వైమానిక దళం సరిహద్దుల్లో ఇనుప గోడలా నిలిచిందన్నారు.

మన వాయుసేన పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిందని చెప్పారు. భారత సాంకేతిక పరిజ్ఞానం ముందు పాకిస్థాన్ ఎన్నటికీ సరితూగలేదని ప్రధాని తెలి పారు. ‘ప్రతి భారతీయుడు సైన్యానికి మద్దతుగా నిలబడ్డాడు. భారత సైనికులకు ప్రతి భారతీయుడు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ధర్మ సంస్థాపనార్థం ఆయుధం పట్టడం మన సంప్రదాయం.

అది మన విధానం. మన అక్కాచెల్లెళ్ల నుదిటి సిందూరం తుడిచినవాని నట్టింట్లోకి వెళ్లి నాశనం చేశాం’ అని మోదీ ఉద్వేగపూరితంగా చెప్పారు. ‘ఇది గౌతమ బుద్ధుడితో పాటు గురు గోవింద్‌సింగ్ తిరుగాడిన నేల’. శత్రువులు మన బల గాలకు సవాలు విసిరామనే సంగతి మరిచిపోయారు.

చివరికి పాక్ సైన్యం మట్టి కరిచింది. కీలకమైన ఎస్ క్షిపణుల వ్యవస్థ ఉన్న ఆదంపుర్ ఎయిర్ బేస్‌ను తమ దాడుల్లో ధ్వంసం చేశామని చెప్పుకున్న పాక్ సైన్యం మాటలను పటాపంచలు చేస్తూ ప్రధాని మోదీ ఈ ఎయిర్ బేస్‌ను ఆకస్మికంగా సందర్శించాడు. అక్కడి వైమానికదళ వీరజవాన్లతో ముచ్చటించారు.

వారిని ఉత్సాహపరిచారు, ఫొటోలు దిగారు. ‘భారత్ మాతాకీ జై’, ‘వందే మాతరం’ అంటూ ప్రధాని, జవాన్లు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఎయిర్ బేస్‌ను ప్రధాని మోదీ కలియతిరుగుతున్నప్పుడు ఒక మిగ్-౨౯ జెట్, సుస్థిరంగా ఉన్న ఎస్--౪౦౦ ఎయిర్ డిఫెన్స్ సిస్టం స్పష్టంగా కనిపించాయి. ప్రధాని పర్యటనతో పాకిస్థాన్‌కు భారత్ గట్టి సందేశం ఇచ్చినట్టు అయింది. పాకిస్థాన్ ప్రచారమంతా అవాస్తవమని ప్రపంచానికి తెలిసేలా చేసింది. 

భారత్‌కు సుదర్శన చక్రంలా పనిచేసిన రష్యా తయారీ ఎస్-౪౦౦ మిస్సైల్ వ్యవస్థ పాక్ సైన్యం నడ్డి విరిచింది. ఆదంపుర్ పర్యటన తర్వాత ప్రధాని మోదీ తన అనుభవాన్ని ఎక్స్‌లో పంచుకున్నారు. ‘ఈ ఉదయం నేను ఆదంపుర్ ఎయిర్ బేస్‌కు వెళ్లాను. అక్కడ మన పోరాట యోధులను కలిసాను. ధైర్యం, ధృడ సంకల్పానికి ప్రతిరూపంగా నిలిచేవారితో మాట్లాడటం ఒక ప్రత్యేక అనుభవం’ అని పేర్కొన్నారు.