calender_icon.png 29 September, 2025 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం

29-09-2025 12:49:04 AM

రాష్ట్ర మంత్రి వాకాటి శ్రీహరి

నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 28 (విజయక్రాంతి):పేదవారందరికీ స్వంతిల్లు ఇందిర మ్మ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరవుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమా భివృద్ధి, క్రీడలు, యువజన సేవల శాఖల మంత్రి వాకాటి శ్రీహరి స్పష్టం చేశారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ని యోజకవర్గం వంగూరు మండల పరిధిలోని మిట్ట సద్దుగుడు గ్రామంలో లబ్ధిదా రు లు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను మంత్రి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా క లెక్టర్ బాదావత్ సంతోష్, అచ్చంపేట ఎమ్మె ల్యే డాక్టర్ వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేదలు ఇల్లు లేక ఇబ్బందులు పడ్డారని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.5 లక్షల సహాయంతో లబ్ధిదారులు గృహాలు నిర్మించుకోవడం సంతోషకరమన్నారు.

నల్లమల్ల ముద్దుబిడ్డ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మా ట ప్రకారమే అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు అందుతుందని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ, ముఖ్యమం త్రి సహకారంతో అచ్చంపేట నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతుం దన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు మం జూరయ్యేలా కృషి చేస్తామన్నారు.

సీఎం సా రథ్యంలో అచ్చంపేట నియోజకవర్గం మరిం త అభివృద్ధి దిశగా సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు కె.వీ.యన్.రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ రాజేందర్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులుపాల్గొన్నారు.