calender_icon.png 29 September, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్టోబర్ 11 నుంచి ఇర్ఫాని దర్గా ఉర్సు

29-09-2025 12:48:03 AM

 సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 28 :సంగారెడ్డి పట్టణ శివారులోని హజ్రత్ మౌలానా అల్ హజ్ హాబీబ్ అహ్మద్ బిన్ ఒమర్ అల్ మారూఫ్ హాబీబ్ ఇర్ఫాన్ అలీ షా బంద నవాజి (ఇర్ఫాని దర్గా) 23వ ఉర్సు ఉత్సవాలు వచ్చేనెల 11 నుండి రెండు రోజుల పాటు జరుగనున్నాయని పీఠాధిపతి హజ్రత్ హకీమ్ ఒమర్ బిన్ అహ్మద్ సజ్జద్ యే నషీన్ బార్గ ఇర్ఫానీ తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు.

మొదటి రోజైన 11వ తేదీ సంగారెడ్డిలోని జామియా మస్జిద్ నుండి సాయంత్రం 5 గంటలకు గంధం ఊరేగింపు, రాత్రి 8గంటలకు ఇర్ఫాని దర్గాలో గంధారాధన, 9 గంటలకు ఆల్ ఇండియా ముషాయిరా ఉంటుందని అన్నారు. రెండవ రోజు 12వ తేదీ సాయంత్రం దీపారాధన, ఖవ్వాలి, అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఇర్ఫానీ దర్గా పీఠాధిపతి హజ్రత్ హకీమ్ ఒమర్ బిన్ అహ్మద్ సజ్జద్ యే నషీన్ బార్గ ఇర్ఫానీ కోరారు. కార్యక్రమంలో అహ్మద్ బిన్ ఉమర్ ఇర్ఫానీ, నోమాన్ బిన్ ఉమర్ ఇర్ఫానీ, ఆర్గనైజింగ్ ఇంచార్జ్ దర్గా కమిటీ షేక్ షకీల్ అహ్మద్ ఇర్ఫానీ, షబ్బీర్ అహ్మద్ హష్మీ, సయీద్ బిన్ సాలెహ్, మహమ్మద్ బిన్ యహియ ఇర్ఫానీ, సలీమ్ ఖాన్,మీర్ అసద్ అలీ ఇర్ఫానీ, అతర్ గౌస్వి తదితరులు పాల్గొన్నారు.