22 June, 2026 | 2:59 AM

ప్రొఫెసర్ స్ఫూర్తిని కొనసాగిస్తాం..

22-06-2026 12:29 AM

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్ల, జూన్ 21 (విజయక్రాంతి): తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలను చేవెళ్ల మండల విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాలె యాదయ్యతో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమత వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు పార్టీల నేతలు చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... జయశంకర్ తన జీవితాన్ని రాష్ట్ర సాధన కోసం పూర్తిగా అంకితం చేశారన్నారు. జీవితమంతా తెలంగాణ కోసం కలలు కంటూ, ఉద్యమానికి మార్గదర్శనం చేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను, స్ఫూర్తిని కొనసాగిస్తామని, అందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. 

బీజేపీ ఆధ్వర్యంలో... 

బీజేపీ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు అత్తేల్లి అనంత్ రెడ్డి ఆధ్వర్యంలో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కాసుల రాము గౌడ్, కౌన్సిలర్లు శైలజ ఆగిరెడ్డి, మంగలి కల్యాణి యాదగిరి, బక్కారెడ్డి మాధవి యాదిరెడ్డి, కె. మంగమ్మ మల్లేష్, మద్దెల శ్రీనివాస్, డి. గోపాల్ రెడ్డి, కృష్ణా నాయక్, తాళ్లపల్లి నర్సింలు, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, వైస్ చైర్మన్ బేగరి రాములు,

పిఎసిఎస్ చైర్మన్లు, దేవర వెంకటరెడ్డి, గోనె ప్రతాప్ రెడ్డి, గొల్లపల్లి సర్పంచ్ లొoక శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ రెడ్డి శెట్టి మధుసూదన్ గుప్తా, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బండారి ఆగిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గిరిధర్ రెడ్డి, ఎర్రోనిగూడ మల్లేష్, రామన్నగూడ, ప్రభాకర్, ఖదీర్, సీనియర్ జర్నలిస్ట్ వి, శ్రీనివాసచారి,విశ్వకర్మ సంఘం నాయకులు శ్రీనివాస చారి,ఆనంద్ చారి, శేఖర్ చారి తదితరులు పాల్గొన్నారు.