రూ.5 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే విజయుడు
అలంపూర్, జూన్ 21: అలంపూర్ మండలంలోని గొంది మల్ల గ్రామానికి చెందిన బిందు వైద్య చికిత్స కోసం రూ.5 లక్షల విలువైన ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)ని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కుటుంబ సభ్యులకు కర్నూలులోని ఎమ్మెల్సీ చల్లా కార్యాలయంలో ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ, అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ప్రజల ఆరోగ్య సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో వైద్యం పొందలేని నిరుపేదలకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సేవలు, వైద్య సహాయ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ బీఆర్‌ఎస్ నాయకులు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.






