calender_icon.png 15 January, 2026 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాయమాటలు చెప్పం.. మంచి చేస్తాం

15-01-2026 12:51:35 AM

కానీ విని ఎరగని రీతిలో అభివృద్ధి చేస్తున్నాం

ఎమ్మెల్యే జిఎంఆర్ ఉండడం దేవరకద్ర ప్రజల అదృష్టం

పలు శంకుస్థాపన కార్యక్రమలలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి

వనపర్తి/దేవరకద్ర/భూత్పూర్, జనవరి 14: ప్రజా పాలన ప్రభుత్వం అంటే ప్రజలు కష్టాలు పడకుండా ప్రతి సమస్యను పరిష్కరించు ముందుకు సాగడమేనని రాష్ట్ర రోడ్ల,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కొత్తకోట, పెబ్బేరు, వనపర్తి, భూత్పూర్, దేవరకద్ర పట్టణాల్లో రాష్ట్ర పశు సంవర్ధక, పాడి అభివృద్ధి మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి పర్యటించారు.

భూత్పూర్ మున్సిపాలిటిలో రూ. 10 కోట్ల 50 లక్షల నిధులతో నాగర్ కర్నూల్ రోడ్డు వద్ద సీతమ్మ కాంప్లెక్స్ నుండి స్ట్రోమ్ వాటర్ డైన్ నిర్మాణం, భూత్పూర్ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనుల నిర్మాణం, ఘన వ్యర్థాలు ప్రాసెసింగ్ యూనిట్ అభివృద్ధి పనుల నిర్మాణం, 1వ వార్డు నుండి 10వ వార్డులలో వివిధ ఏరియాలో వి.డి.సి.సి. రోడ్డు మరియు సి.సి. డ్రైన్ నిర్మాణం,రూ 50 లక్షల రూ.లతో హోల్ సేల్ కం రిటైల్ పిష్ మార్కెట్ నిర్మాణం, రూ 3 కోట్ల 50 లక్షల నిధులతో సారిక టౌన్షిప్ వద్ద పార్కు అభివృద్ధి నిర్మాణం, అమిస్తాపూర్ వద్ద 1వ వార్డు నుండి 10వ వార్డులలో వివిధ ఏరియాలో వి.డి.సి.సి. రోడ్డు, సిసి డ్రైన్ నిర్మాణం పనులకు, దేవరకద్ర మున్సిపాలిటీలో రూ 10 కోట్ల  నిధులతో ఆర్‌ఓబీ క్రింద సిసి రోడ్లు, పార్కింగ్ సుందరీకరణ ఫుట్ పాత్, ల్యాండ్ స్కేపింగ్, మెయిన్ రోడ్ అభివృద్ధి నిర్మాణ పనులకు, రూ 12 కోట్ల నిధులతో స్పోరట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు, రూ 5 కోట్ల నిధులతో మున్సిపాలిటీలో వివిధ ప్రదేశాలలో వరద నీటి డ్రైన్ నిర్మాణ పనులకు, రూ 2 కోట్లతో స్విమ్మింగ్ పూల్ పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెండు సంవత్సరాలుగా సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు  తెలిపారు. మహాలక్ష్మి పథకం తో ఆర్టిసి బస్సుల ద్వారా రూ 10 వేల కోట్లు ఖర్చు పెట్టీ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.

గుడిసెల్లో ఉన్న పేద వారికి 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు  విద్యుత్ ఉచితంగా కల్పిస్తూ కరెంట్ సంస్థలకు రూ 6 వేల కోట్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైతులకు రూ 21 వేల కోట్లతో 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో రూ 20 వేల కోట్ల  ఖర్చు చేసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. దేవరకద్ర,జడ్చర్ల నియోజక వర్గం లో కూడా పాఠశాలల పనులు జరుగుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం రూ 7 లక్షల కోట్లు అప్పులు చేసిన వాటికి వడ్డీ,అసలుకు రూ 13 వేల కోట్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు 90 శాతం పూర్తి చేశామని చెప్పడం ఆవాస్తవమన్నారు. రూ 7 వేల కోట్లు ఖర్చు చేసి ఉదండ పూర్ వరకు భూ సేకరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

కోయిల్ సాగర్ ప్రాజెక్టు లో మిగిలిన పనికి, కల్వకుర్తి ఇతర ప్రాజెక్ట్ లు పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. ఎస్.ఎల్.బి.సి సొరంగం పను లు అమెరికా నుండి బేరింగ్ లు తెప్పించినట్లు,వేరే విధంగా మళ్లీ పనులు మొదలు పెట్టినట్లు తెలిపారు. దేవరకద్ర లో డిగ్రీ కళాశాల, అమృత్ పథకం కింద రూ 5 కోట్ల పనులు,100 పడకల ఆసుపత్రి నిర్మాణం ఎమ్మెల్యే జిఎంఆర్ పట్టు బట్టి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. కురుమూర్తి స్వామి దేవస్థానం కు ముఖ్యమంత్రి తో కలిపి రూ 110 కోట్ల రూ లతో ఘాట్ రోడ్డు, రోప్ వే పనులను ప్రారంభించినట్లు, వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి  పూర్తి చేస్తామని తెలిపారు. దేవరకద్ర ఎమ్మెల్యే గా జిఎమ్‌ఆర్ ఉండడం దేవరకద్ర నియోజకవర్గం ప్రజల అదృష్టమని చెప్పారు.

ఎక్కడ కలిసిన ఏమి చేసిన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పరితపిస్తుంటారని పేర్కొన్నారు.  అనంతరం రాష్ట్ర పశు సంవర్ధక పాడి అభివృద్ధి, మత్స్య, క్రీడల,యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ అన్ని రంగాల్లో దేవరకద్రను ముందు ఉంచేందుకు ఎమ్మెల్యే జిఎంఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేశారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ అభివృద్ధి చేస్తున్నామని రాబోయే ప్రతి ఎన్నికల్లోను కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయెదిర బోయి, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్డిఓ నవీన్ కుమార్, కాంగ్రెస్ నేతల, మండలాల కార్యకర్తలు, నాయకులు ఉన్నారు.