29 April, 2026 | 3:47 AM

ట్రాఫిక్ సమస్య లేకుండా చూస్తాం

29-04-2026 02:14 AM

సీఐ అనుముల శ్రీనివాస్

మంగపేట, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలంలోని శ్రీ హేమాచల(మల్లూరు) లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్ తెలిపారు.

మంగళవారం మంగపేట యస్‌ఐ టి.వి.ఆర్. సూరి, రెండవ యస్‌ఐ శ్రీకాంత్ ల తో కలిసి మల్లూరు గ్రామంలోని ఆర్చీ నుండి శ్రీ హేమాచల(మల్లూరు) లక్ష్మీనృసింహస్వామి ఆలయం వరకు రోడ్డును, ఆలయ పరిసర ప్రాంతాలను,. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఎలాంటి చర్యాలు తీసుకోవాలో పరిశీలించారు. అనంతరం స్వామీ వారిని దర్శించుకున్నారు. స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ చర్యలు తీసుకోనున్నట్లు ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, యస్‌ఐ టి.వి.ఆర్. సూరి తెలిపారు.