calender_icon.png 21 January, 2026 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీబీ- జీ రామ్ జీ చట్టం రద్దయ్యే వరకు పోరాడుతాం

21-01-2026 12:23:01 AM

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి కుట్ర చేస్తున్న మోడీ

మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు

మెదక్, జనవరి 20 (విజయక్రాంతి): వీబీ-జీరామ్ జీ చట్టం రద్దయ్యే వరకు పోరాటం చేస్తామని మెదక్ ఎమ్మెల్యేడాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మండిపడ్డారు. పేదలకు ఉపా ధి కల్పించాలనే మంచి ఉద్దేశ్యం తో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూపిఏ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి పని కల్పిస్తే దానిని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ కుట్ర చేస్తోందని విమ ర్శించారు. స్కీమ్ ను మార్చడమంటే పేదల పొట్టకొట్టడమేనని విమర్శించారు. వీబీ-జీరామ్ జీ చట్టం రద్దయ్యే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మంగళవారం మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో దీక్ష చేపట్టారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మా గాంధీ గ్రామీణ ఉ పాధి హామీ పథకం పేరునే కాకుండా దాని ఆత్మ, అమలు విధానాన్ని మార్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా కల్పించాలనే మహాత్మా గాంధీ ఆలోచనలకు విరుద్ధంగా కేంద్రం చట్టం తేవడం దుర్మార్గమన్నారు. ఈ చట్టం తేవడం మూలంగా పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నదన్నారు. గతంలో వందశాతం నిధులు వెచ్చిస్తూ పథకాన్ని అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు తన వాటాను 60 శాతానికి తగ్గించి, మిగిలిన 40శాతం భారాన్ని రాష్ట్రా లపై మోపడం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

డిసిసి అధ్యక్షులు రెడ్డి పల్లి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో బీజేపీ పాత్ర లేదన్నారు. మహాత్ముని పేరు ఎక్కడ కనిపించవద్దు అని బీజేపీ నేతలు అంటున్నారని విమర్శించారు. మెదక్ అభివృద్ధి జరగలంటే అన్ని మున్సిపాలిటీలు గెలువాలన్నారు. అనంతరం చౌరస్తాలో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.

ఈ కార్యక్రమం లో మాజీ మున్సిపల్ చైర్మన్ తోడుపునూరి చంద్రపాల్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మందుగుల గంగాధర్ జిల్లా సర్పంచుల ఫోరమ్ అధ్యక్షలు ఆవుల గోపాల్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులుసుప్రభాత్ రావ్,మేడి మధుసూదన్ రావ్,రాగి అశోక్, సరాఫ్ యాదగిరి, శ్రీనివాస్ చౌదరి, ముత్యం గౌడ్,హరిత, జ్యోతి, అశ్విని, శివ రామకృష్ణ, గాడి రమేష్ సునీల్ స్వరూప కృష్ణ, లక్ష్మీనారాయణ గౌడ్,లింగం,,ప్రభాకర్, నాగరాజు,అశ్విని, గోదల జ్యోతి, తిరుప తి రెడ్డి,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుపరుశరామ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.