21-01-2026 12:24:01 AM
కాంగ్రెస్‌లో చేరిన బిఆర్‌ఎస్ మాజీ కౌన్సిలర్
డీసీసీ మాజీ అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి
తూప్రాన్, జనవరి 20: త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో తూప్రాన్ మున్సిపాలిటీనీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని సిద్దిపేట జిల్లా డిసిసి మాజీ అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి అన్నారు. మంగళవారం తూప్రాన్ రెండోవాడు కౌన్సిలర్ మామిడి వెంకటేష్ బిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి సుమారు 2వందల మంది కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోత్కు దుర్గాప్రసాద్ నివాసంలో పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో నర్సారెడ్డి మాట్లాడారు.
వార్డులలో బలమైన నాయకులు బరిలో ఉండాలని సూచించారు. తూప్రాన్ మున్సిపాలిటీలో అన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచి చైర్మన్ పీఠం దక్కించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవాలయం కమిటీ చైర్మన్ పల్లేర్ల రవీందర్ గుప్తా, తూప్రాన్ మున్సిపల్ మాజీ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ, మాజీ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, నాయకులు నాగరాజుగౌడ్, విశ్వరాజ్, నారాయణ గుప్తా, శ్రీధర్ రెడ్డి, దీపక్ రెడ్డి, నగేష్, నర్సింగ్ రావు, రాము, నాగరాజు యాదవ్, విట్టల్ రెడ్డి, రవి, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.