calender_icon.png 2 May, 2025 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీం ఆదేశాలు పాటిస్తాం

17-04-2025 01:35:06 AM

కంచ భూములు ప్రభుత్వ భూములని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది

  1. ఫేక్ ఫొటోలతో కుట్ర
  2. మాది కూలగొడితే కూలిపోయే ప్రభుత్వం కాదు..
  3. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): కంచ గచ్చిబౌలి భూముల విషయంలో న్యాయస్థానాల ఆదేశాలను పాటిస్తామని, ప్రభుత్వ భూములను కాపాడుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వ భూములని సుప్రీంకోర్టు చెప్పిందని పేర్కొన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన పోస్టుపై చట్టం ప్రకారం ముందుకెళ్తామని తెలిపారు.

బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..కంచ గచ్చిబౌలి భూములపై ఫేక్ వీడియోలు, ఫేక్ పోస్టులు పెట్టి ఉద్దేశపూర్వకంగానే ప్రచారం చేశారని మండిపడ్డారు. కేంద్రమం త్రులు మొదట వీడియోలు సోషల్ మీడియాలో పోస్టులు చేశారని, ఆ తర్వాత డిలిట్ చేశారని తెలిపారు.

రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయాలని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయని, చట్టం ఎవరికీ చుట్టం కాదనే విషయం తెలుసుకోవాలని హెచ్చరించారు. ‘నకిలీ వీడియోస్, ఫొటోలు అన్ని వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయి. భూముల విషయం కోర్టుల పరిధి లో ఉన్నందున ఏమి మాట్లాడలేం. నెమళ్లు జనావాసాల్లోకి రావడం సర్వసాధారణం.

బీఆర్‌ఎస్, బీజేపీ కలిసే కుట్ర చేస్తున్నాయి’ అని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే ప్రధాని నరేంద్రమోదీ కూడా కంచ గచ్చిబౌలి భూములపై స్పందించారని తెలిపారు. సుప్రీంకోర్టు అడిగే ప్రతీ ప్రశ్నకు ప్రభు త్వం సమాధానం ఇస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

ఏ బుక్‌లో రాస్తే ఏ ముంది.. వాళ్లు వస్తే కదా రివేంజ్ తీసుకోవడానికి అని పరోక్షంగా బీఆర్‌ఎస్ నేత కవితను ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి గద్దె దింపుతామని బీఆర్‌ఎస్ చెబుతోందని, ప్రజలపై తమకు నమ్మకం ఉంద ని, బీఆర్‌ఎస్ కూలగొడితే ప్రభుత్వం కూలిపోదన్నారు.

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను అభివృద్ధి చేస్తామని, లక్షలాది మం దికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే సోనియా గాంధీ, రాహుల్‌గాంధీపై ఛార్జిషీట్ చేశారన్నారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో ఒక్క రూపాయి కూడా చేతులు మారలేదని తెలిపారు. గాంధీ కుటుంబం ఆగర్భశ్రీమంతులని, వాళ్లకు మనీ లాండరింగ్ చేయాల్సిన అవసరం ఏముందన్నారు.