27 March, 2026 | 7:53 AM

ఎన్నికల హామీలను నెరవేరుస్తాం

04-05-2024 01:50 AM

వరంగల్, మే 3 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి, కాంగ్రెస్ ప్రతి హామీని అమలు చేస్తుందని పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. శుక్రవారం ఆమె వరంగల్‌లోని ఓ మైదానంతో పాటు కూరగాయల మార్కెట్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వ్యాపారులు, వాకర్స్‌ను ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం సాధ్యమన్నారు. ప్రచారంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.