రవాణా వాహనాల పార్కింగ్‌కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం
ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్
కుత్బుల్లాపూర్, ఆగస్టు 21(విజయక్రాంతి): ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా రవాణా వాహనాల పార్కింగ్ కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని బిఆర్‌ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ తెలిపారు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 - రంగారెడ్డి నగర్ డివిజన్ లోని గాంధీ నగర్ ప్రధాన రహదారిలో గల డీసీఎం అసోసియేషన్ పార్కింగ్ స్థలాన్ని బిఆర్‌ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్‌అధికారులతో కలిసి పరిశీలించి డీసీఎం అసోసియేషన్ సభ్యుల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న జనాభా, ఇరుకైన రోడ్లు, వాహనాల రద్దీతో పారిశ్రామిక వాడలోని వస్తువులను రవాణా చేసే వాహనాల పార్కింగ్ సమస్య జటిలంగా మారిందని అన్నారు. డీసీఎం అసోసియేషన్ సభ్యుల పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు ఏసీపీ గిరి ప్రసాద్, ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ రావు, మాజీ కార్పొరేటర్ విజయ్ శేఖర్ గౌడ్, గాంధీ నగర్ డీసీఎం అసోసియేషన్ ప్రెసిడెంట్ సమ్మయ్య యాదవ్, ప్రాధాన కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు జాఫర్ తదితరులు పాల్గొన్నారు.






