మా ఇండ్లను వదులుకోం.. నష్టపరిహారం మాకొద్దు
ప్రభుత్వ తీరుపై మధు పార్క్ రిడ్జ్ నివాసితుల నిరసన
రాజేంద్రనగర్ మార్చి 20 (విజయక్రాంతి) : మధు పార్క్ రిడ్జ్ అపార్ట్ మెంట్ విషయంలో ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో సమూహంగా పోరాడి అపార్ట్మెంట్‌ను నిలబెట్టుకుంటామని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు .. ఎన్నో సంవత్సరాల తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు పైసా పైసా కూడబెట్టుకుని కోట్ల రూపాయలు వెచ్చించి బ్యాంకు రుణాలు తీసుకొని మధు పార్క్ రిడ్జ్ లో అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కొనుగోలు చేశామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మా కు ఎంత పరిహారం ఇచ్చిన వద్దే వద్దు మా ఇండ్లు మాకే కావాలి... ఎక్కడో కూర్చుని సీఎం రేవంత్ రెడ్డి గాలి మాటలు మాట్లాడొద్దని బండ్లగూడ జాంగిర్ పరిధిలోని మధు పార్కు రెడ్డి అపార్ట్మెంట్ నివాసితులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఎంత పరిహారం ఇచ్చిన తమ రెక్కలు ముక్క లు చేసుకుని ఇల్లు కట్టుకుంటే ఎలా కూల్చివేస్తారని ప్రశ్నిస్తున్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మిస్తే తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని కానీ తమ ఇళ్లను కూల్చి వేయొద్దని డిమాండ్ చేశారు.
తమ ఇళ్ళను కూలగొడదామంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని నివాసితులు స్పష్టం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్న తమ ఇళ్ళతో తా ము అనుబంధం పెంచుకున్నామని ఇప్పుడు కులకొడతామంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఇక్కడికి వచ్చి తమతో మాట్లాడాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంతేకాక గాంధీ విగ్రహం ఏర్పాటును ఆయన మునిమనువడు తుషా ర్ గాంధీ కూడా వ్యతిరేకించారని కానీ ఆయనను ప్రభుత్వ పెద్దలు సర్ది చెప్పడానికి ప్రయ త్నిస్తున్నారని ఆరోపించారు.




