26 May, 2026 | 4:26 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

ముదిరాజుల అణిచివేతను సహించం

02-04-2026 01:10 AM

బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్

ఖైరతాబాద్, ఏప్రిల్ 1(విజయక్రాంతి): ముదిరాజ్ సామాజికవర్గాన్ని ఆర్థికంగా, రాజకీయంగా అణచివేసేందుకు జరుగుతున్న కుట్రలను ఇకపై ఉపేక్షించేది లేదని ముదిరాజ్ కో-ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ స్పష్టం చేశారు. నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన ముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నాహక సమావేశం బుధవారం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుంచి ముదిరాజులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమన్వయ కమిటీ నిరంతరం పోరాడుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముదిరాజులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. ఈ సమావేశంలో ముదిరాజ్ సామాజికవర్గానికి సంబంధించిన కీలక తీర్మానాలను ఆమోదించారు.

ముఖ్యంగా ముదిరాజులను బిసి-డి జాబితా నుంచి బిసి-ఏలోకి మార్చాలనే ప్రధాన డిమా్ంప లోతుగా చర్చించారు. దీనికి తోడు కోకాపేటలో కేటాయించిన ముదిరాజ్ భవనాన్ని త్వరలోనే ముదిరాజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రస్టుగా నిర్మించాలని నిర్ణయించారు.

ఈ లక్ష్యాల సాధన కోసం మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు, రాజకీయ నాయ కులతో కూడిన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు.ముదిరాజ్ ఆత్మీ య గౌరవాన్ని చాటిచెప్పేలా జరిగిన ఈ భేటీలో సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ చొప్పరి శంకర్, అందే బాబయ్య, ఉప్పరి నారాయణ, మొరే రోహిత్, గొడుగు శ్రీనివాస్, డాక్టర్ వినోద్ సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.