ఘనంగా ఉరిసే షరీఫ్ జాతర
అలరించిన కుస్తీ పోటీలు
జహీరాబాద్, ఏప్రిల్ 1: జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలం డప్పు గ్రామంలో 106వ ఉరిసే షరీఫ్ జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ జాతరను తిలకించేందుకు మల్గి, డప్పూరు, హత్నూర, న్యాల్కల్, హగ్నూరు, రుక్మాపూర్, కర్ణాటక రాష్ట్రం బీదర్ తదితర ప్రాంతాల నుంచి ప్రజ లు తరలివచ్చి దర్గాను దర్శించుకుని మొక్కు లు తీర్చుకున్నారు. డప్పురు గ్రామం చెందిన గ్రామ సర్పంచ్ జగదాంబ జాతరకు వచ్చే ప్రజల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు.
అలరించిన కుస్తీ పోటీలు...
గైబ్ సాబ్ ఉరిసే షరీఫ్ జాతరలో కుస్తీ పోటీలు ఘనంగా నిర్వహించారు. కర్ణాటక, మహారాష్ట్ర తెలంగాణ నుంచి కుస్తీ పడేవారు వచ్చారు. వీరిలో మొదటి బహుమతిగా కర్ణాటకకు చెందిన శరణప్ప అనే వ్యక్తి మొదటి బహుమతి కింద ఐదు తులాల వెండిని బ హుమతిగా అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జగదాంబ నిర్వాహ కులు కిరణ్ కుమార్ గౌడ్, జి రాజు నరసింహులు, వడ్డీ గ్రామానికి చెందిన రాజు తదితరులు పాల్గొన్నారు.




