calender_icon.png 23 August, 2025 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెటింగ్ శాఖను ప్రైవేటీకరిస్తే సహించం

14-03-2025 12:48:41 AM

 గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్, మార్చి 13: వ్యవసాయ మార్కెటింగ్ శాఖను ప్రైవేటీకరిస్తే సహించబోమని గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ, రైతు సంక్షేమ కమిషన్ కోదండ రెడ్డిల ఆధ్వర్యంలో  హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడు తూ.. వ్యవసాయ మార్కెటింగ్ శాఖను ప్రైవేటీకరిస్తేసహించబోమన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మోడీ సర్కార్ గతంలో తీసుకొచ్చిన నాలుగు నల్ల చట్టాలను వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు చేపటడంతో  కేంద్ర ప్రభుత్వం వెనుకకు తగ్గిందికానీ... పార్లమెంట్‌లో ఆ చట్టాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వ లేదన్నారు.

మోడీ సర్కార్ అధికారంలో వచ్చినప్పటి నుంచి.. కేంద్ర ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్ప జెప్పందన్నారు. అదే విధంగా మార్కెటింగ్ శాఖను కూడా అప్పజెప్పే ప్రయత్నాలు చేస్తుందన్నారు. దీని వలన రైతులు తీవ్రంగా నష్టపోతారని.. అన్నదాతలు సర్వం కోల్పో యే అవకాశాలున్నాయన్నారు. మార్కెటింగ్ శాఖపై కేంద్ర ప్రభుత్వం తీసుకుని నిర్ణయాన్ని వాపస్ తీసుకోవాలని... లేని పక్షంలో దేశవ్యాపితంగా ఎంతటి ఉద్యమాలకైనా సిద్ధమేనని అన్నారు.

అదే విధంగా ఈ సమావేశంలో రాష్ట్రంలోని ఉన్న అన్నీ రైతు సంఘాల నాయకులు పాల్గొన్ని వారి అభిప్రాయాలను వివరించం జరిగిందన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ, రైతు కమిషన్ సభ్యులు వ్యవసాయ మార్కెటింగ్, మార్క్ ఫెడ్,  పౌరసరపర శాఖల అధికారులు, వివిధ రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.