23-08-2025 12:40:02 PM
- ఈ శిక్షణ తరగతులకు 277 విద్యార్థుల ఎంపిక
- విద్యాభ్యాసంకు నూతన విధానాలకు శ్రీకారం చుడుతున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్
మహబూబ్ నగర్ (విజయక్రాంతి : చదువు బాగా చదివితే ఈ భవిష్యత్తు తీర్చి దిద్దుతుంది అంటూ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నూతన విధానానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని 27 ప్రభుత్వం ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి, మహబూబ్ నగర్ ఫస్ట్, వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శతశాతం అనే కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టారు. అందులో భాగంగా మహబూబ్ నగర్ పట్టణ, మహబూబ్ నగర్ రూరల్, హన్వాడ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మహబూబ్ నగర్ ఫస్ట్, వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించారు.
ఎంట్రెన్స్ టెస్ట్ లో మెరిట్ సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే గారి సహకారంతో ఈనెల 23,24 తేది లలో విద్యార్థులకు క్యాంపు కార్యాలయంలో ప్రేరణా తరగతులను అనుభవజ్ఞులైన అధ్యాపకుల బృందంచే నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రేరణ తరగతులలో పాల్గొన్న విద్యార్థులు తమతమ పాఠశాల లో లిటిల్ టీచర్స్ గా పనిచేస్తారని వందేమాతరం ఫౌండేషన్ సభ్యులు అనిల్ తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు మొత్తం 277 మంది విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ సభ్యులు రవీందర్, మహేందర్ రెడ్డి, వెంకటేష్, మహబూబ్ నగర్ ఫస్ట్ సభ్యులు రాధిక, మౌనిక, నిఖత్, సమాన్, 27 వాలంటీర్స్ , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.