calender_icon.png 25 August, 2025 | 10:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేస్తాం

25-08-2025 12:00:00 AM

సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల 

నకిరేకల్ ఆగస్టు 24(విజయ క్రాంతి) : నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 5, 6  వార్డులలో నెలకొని ఉన్న సమస్య లను పరిష్కరించకపోతే ఆందోళనలు నిర్వహిస్తామని సిపిఐఎం జిల్లా కార్య దర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని 5,6 వార్డులలో సిపిఎం పార్టీ ఆధ్వర్యం లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వే నిర్వహించారు. ఆ వార్డులలోనీ ప్రజలు డ్రైనేజీ, కరెంటు, సిసి రోడ్డు సమస్యలను సర్వే బృందానికి విన్నవించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ వార్డులలో నెలకొన్న సమస్యలను పాలకవర్గం అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కారం అయ్యేదాకా వెన్నంటి ఉంటామన్నారు. చీమల గడ్డ దళిత కాలనీలో ప్రధాన మురికి కాలువకు నాలుగు వీధులలోని మురికి నీరు వచ్చి ఒకే చోట నిలువ ఉండటంతో  ప్రజలు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారన్నారు.   మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం సిసి రోడ్డును ధ్వంసం చేసి పట్టించుకోవడం లేదన్నారు

ఆ రోడ్డు వెంట వాహనాలు వెళ్లే పరిస్థితి లేదని అధికా రులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.  సిపిఎం పార్టీ మండల, పట్టణ కార్యదర్శి లు రాచకొండ వెంకట్ గౌడ్, వంటే పాక వెంకటేశ్వర్లు, చీమల గడ్డ ఏరియా కార్యదర్శి వంటే పాక క్రిష్ణ, నాయకులు సాకుంట్ల నరసింహ,ఏర్పుల తాజేశ్వర్ , వంటేపాక నాగార్జున, ఆదిమళ్ళ ప్రవీణ్, బుడిగే వెంకన్న, రేణుక, శ్రావణి, స్వప్న పాల్గొన్నారు.