calender_icon.png 25 August, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘స్థానిక’ పోరు.. పర్యటనల హోరు!

25-08-2025 12:00:00 AM

-కాంగ్రెస్, బీజేపీ నుంచి పోటీకి ఆసక్తి

-పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు  ప్రయత్నాలు 

-తమ వర్గానికి చెందిన వారి మద్దతు కోసం సమావేశాలు

నిజామాబాద్ ఆగస్టు 24 (విజయ క్రాంతి) ః నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి వేడెక్కుతోంది. న్యాయపరమైన ఆదేశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించేందుకు సిద్ధమవుతోంది గ్రామపంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వ ఏర్పాట్లు మొదలయ్యాయి. వచ్చే నెలలో ఎన్నికల ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో పల్లెల్లో మళ్ళీ వేడి రాజు కుంది.

ఆయా పార్టీల రాష్ర్ట నాయకుల పర్యటనలు ఖరారు చేస్తూ  పార్టీలు తమ ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఒక అడుగు ముందే ఉంది అని చెప్పవచ్చు 25వ తేదీన నిజామాబాద్ జిల్లా  బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం ఖరాబ్ చేసింది. ఆత్మీయ భూస్థాయి కార్యకర్తల సమావేశం పేరా నిజామాబాద్ జిల్లాలో పార్టీ పటిష్టతకై బిజెపి రాష్ర్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు నిజామాబాద్ కు సోమవారం రానున్నారు.

మరోవైపు అధికార పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ కూడా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కార్యక్రమాలు నిర్వహిస్తూ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరిధిలోని గ్రామాలలో నిత్యం పర్యటిస్తూనే ఉన్నారు. తమ ప్రముఖ అనుచర గణంతో ఎప్పటికప్పుడు గ్రామాల పరిస్థితి పోటీకి సిద్ధమవుతున్న అభ్యర్థుల వివరాలను తెలుసుకుంటున్నారు.,టిఆర్‌ఎస్ పార్టీ మాత్రం ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మొదలు పెట్టలేదు జిల్లాలో టిఆర్‌ఎస్ పార్టీ నాయకత్వ లోటు స్పష్టంగా కనబడుతోంది. జిల్లా అధ్యక్షుడు మాత్రం హైదరాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహిస్తూ నిజామాబాద్ గ్రూపులలో పోస్ట్ చేస్తున్నారు.

ఒకప్పుడు కళకళలాడిన నిజామాబాద్ జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం వెలవెలబోతోంది.ఇటీవల గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసి దాదాపు ఏడాది పూర్తికావస్తున్న ప్పటికీని గ్రామపంచాయతీ ఎన్నికలు 2019 జనవరిలో జరిగాయి.గ్రామపంచాయతీ సర్పంచులు వార్డు మెంబర్లు ఫిబ్రవరి రెండు నుండి పదవి లో కొన సాగారు. నిజామాబాద్ జిల్లాలోని 530 గ్రామ పంచాయ తిల్లో ఎన్నికైన సర్పంచులు వార్డు సభ్యులు ఫిబ్రవరి 1.2024 న పదవి కాలం పూర్తయింది. నాటి నుండి నేటి వరకు ప్రత్యేక అధికారుల పాలనలోనే గ్రామపంచాయతీలు కొనసాగుతున్నాయి గ్రామపంచాయతీ పల్లెల్లో ఎన్నికలు నిర్వహించడంతోపాటు వార్డుల కు సంబంధించి సభ్యులు  గా పోటీ చేయడానికి హౌస్ స్థాయికులు పోటీ పడుతున్నారు ఆయా పార్టీలకు చెందిన వారు తమ అగ్ర నాయకుల ఆశీస్సులు పొందడానికి నిత్యం వారిని జిల్లాలో హైదరాబాద్లోనూ కలుస్తూ ఈసారి తమకు అవకాశం కల్పించవలసిందిగా ప్రాధేయపడుతున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నట్లు స్పష్టమవుతోంది జిల్లాలో గ్రామపంచాయతీలతో పాటు మండల  పరిషత్ ఎంపీటీసీ ఎన్నికలు కూడా వీటితోపాటు నిర్వహించనున్నారు. ఎంపీటీసీ లతోపాటు జడ్పిటిసి ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. నిజామాబాద్ జిల్లాలో 33 మండలాలు ఉండగా రెండు మండలాలు ఉన్నాయి ఇందులో రెండు అర్బన్ మండలాలను మినహాయించగా 31 మండలాలకు ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించనుంది. జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల కోసం ఏప్రిల్ 20 2019లో నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది ఈ మూడు విడతల్లో నిజామాబాద్ జిల్లాలోని రెవెన్యూ డివిజన్ ఆధారంగా నిర్వహించారు.

నిలగడుగులోగా ఓట్ల లెక్కింపును పూర్తి చేశారు జూన్ 2న జడ్పీ చైర్మన్ తో పాటు ఎంపీపీలు పదవిసికారం చేసి పదవిలో కొనసాగారు గత సంవత్సరం జూన్ లో పూర్తయిన వీరి పదవి కాలం జిల్లాలో 2009 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 28 జడ్పిటిసి స్థానాలకు ఎన్నికలు జరిగాయి ప్రస్తుతం 31 మండలాలతో పాటు పెరిగిన ఎంపీటీసీ స్థానాలను కలిపి 3 07 స్థానాలకు చేరింది. ఒకవేళ భవిష్యత్తులో ప్రభుత్వం నియోజకవర్గాల మార్పు నిజామాబాద్ జిల్లాలో చేసినట్లయితే ఈ సంఖ్య మరింత పెరగనుంది. అధికారులు ఇప్పటికే ఓటర్ లిస్టు నువ్వు సిద్ధం చేశారు పోలింగ్ కేంద్రాలను గుర్తించి పోలింగ్ ఏర్పాట్లు పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉంది.

మేరకు ఎన్నికల సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వడం పూర్తయింది ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్న ఎన్నికల ఏర్పాట్లకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు టిఆర్‌ఎస్ బిజెపి నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ బిజెపిల మధ్య గట్టి పోరు ఉంటుందన్న పరిస్థితి నెలకొని ఉంది. ఇందుకు కారణం గత ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ మూడో స్థానానికి చేరుకోవడమే.

సర్పం ఎంపీటీసీ జడ్పిటిసి పదవులకు పోటీ చేసేందుకు పార్టీ టికెట్లకు కొందరు ప్రయత్నం చేస్తుండగా పోటీ ఎక్కువగా ఉన్న స్థానాల్లో మరికొందరు పార్టీ టిక్కెట్లు రాని ెుడల స్వతంత్రులుగా పోటీ చేసేందుకు తమ అనుచర గణారంతో గ్రామాల్లో ఉంటూ వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజల మధ్యలో ఉంటున్నారు. మరికొందరు మరికొందరు సిట్టింగ్ అభ్యర్థులు పదవి కాలం పూర్తయినప్పటికిని మళ్లీ పట్టు సాధించడానికి తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు.