calender_icon.png 17 July, 2025 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో 49 రద్దు చేసే వరకు ఉద్యమిస్తం

15-07-2025 12:00:00 AM

ఆదిలాబాద్, జూలై 14 (విజయ క్రాంతి):  ఆదివాసీ లకు అన్యాయం చేసే జీవో నెంబర్ 49ని రద్దు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ డిమాండ్ చేశారు. తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు  తహసీల్దార్ లకు వినతి పత్రాన్ని అందించడంలో భాగంగా సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా ను కలిసి వినతి పత్రాలు అందజేశారు. అనంతరం గోడం గణేష్ మాట్లాడుతూ జీవో నెంబర్ 49 పేరుతో ఆదివాసీల మనగడ ను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అడవులనే నమ్ముకుని అడవుల్లో జీవిస్తున్న ఆదివాసీ లను అడవుల నుండి వెళ్ళగొట్టడం కుట్రలో భాగమని పేర్కొన్నారు. 49 జి.ఓ రద్దు అయ్యేంత వర కు ఆదివాసీ సంఘాలు, తుడం దెబ్బ, రాయి సెంటర్, రాజ్ గోండ్ సేవ సమితి, కుల సం ఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కల్సి ఉద్యమలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘ ప్రతి నిదులు పుర్క బాపురావు, పంద్ర జైవంత్ రావ్, పెందూర్ దాదారావు, కూడిమేత తిరుపతి, తోడసం నాగోరావు, మెస్రం నాగనాథ్ తదితరులు పాల్గొన్నారు.